Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: 13వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ (లింగమనేని లక్ష్మీ మెమోరియల్ కప్) శుక్రవారం ఘనంగా ఆరంభమైంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పోటీలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..' రాష్ట్రంలో క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, నియోజకవర్గానికి ఓ స్టేడియం నిర్మాణంతో తెలంగాణను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేందుకు కషి చేస్తున్నాం. అన్ని వయో విభాగాల్లో పోటీలను నిర్వహిస్తూ టెన్నిస్ అభివద్దికి కషి చేస్తున్న హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘంకు అభినందనలు. క్రీడా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని' తెలిపారు. ఆరంభ వేడుకల సందర్భంగా 80 ఏండ్ల వయసులోనూ ఉత్సాహంగా టెన్నిస్ పోటీల్లో పాల్గొంటూ, యువత ఆదర్శంగా నిలుస్తున్న మాస్టర్ అథ్లెట్లు రామరాజు, డిడిఆర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మండవ లక్ష్మీ నారాయణలను హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం (హెచ్ఓటీఏ) అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సత్కరించారు. 13వ హెచ్ఓటీఏ టోర్నీలో దేశవ్యాప్తంగా 390 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. క్రీడాకారులు అందరికీ ఉచిత భోజన, వసతి సౌకర్యం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టోర్నీ ఆర్గనైజింగ్ డైరెక్టర్ అనిరుధ్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫీస్ బేరర్లు సహా తదితరులు పాల్గొన్నారు.