Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) శనివారం ఘనంగా మొదలైంది. ముంబయిలో జరిగిన ఆరంభ వేడుకల్లో ఐదు జట్ల కెప్టెన్లు, బీసీసీఐ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడ్డాయి. ఆరంభ వేడుకల్లో నృత్య ప్రదర్శనలు అభిమానులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
డ్రెస్సింగ్‌రూమ్‌లో సహచరులతో..
- ఇన్నింగ్స్‌ను పంచుకున్న హెడ్, లబుషేన్
ఇండోర్ : భారత్‌లో భారత్‌పై టెస్టు విజయం ఓ మైలురాయితో సమానం. అద్వితీయ విజయంతో పాటు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియా శుక్రవారం ఇండోర్‌లో సంతోషంగా గడిపింది. తొలి సెషన్లోనే మ్యాచ్ ముగిసినా.. సాయంత్రం వరకు ఆస్ట్రేలియా క్రికెటర్లు మైదానంలో సందడి చేశారు. అశ్విన్, జడేజాలను ఎదుర్కొంటూ సాగిన ఇన్నింగ్స్‌లను ట్రావిశ్ హెడ్, మార్నస్ లబుషేన్‌లు సహచరులతో ఎంతో ఆనందంగా పంచుకున్నారు. విజయానంతరం డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్న మార్నస్ లబుషేన్.. ఓ అర గంట తర్వాత సహచరులకు తను అశ్విన్, జడేజా మాయజాలానికి ఏ విధంగా చెక్ పెట్టాననే విషయాన్ని పంచుకున్నాడు. ఇక, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1తో టీమ్ ఇండియా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు కోసం అహ్మదాబాద్ టెస్టులో గెలిచి తీరాల్సిన పరిస్థితి. భారత్, ఆస్ట్రేలియా చివరి టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగనుంది.