Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం : ఈ నెల 19న విశాఖ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్కు ఈ నెల 10 నుంచి టికెట్లను విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఎస్. గోపీనాథరెడ్డి తెలిపారు. 10 నుంచి ఆన్లైన్లో, 13 నుంచి ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆఫ్లైన్లో ఈసారి మూడు కేంద్రాల్లో విక్రయాలు చేపడుతున్నామని, ఎక్కడెక్కడ అనేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. పేటిఎంలోనూ లభిస్తాయన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా నిర్ణయించామన్నారు.