Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోమ్: ఫిఫా అధ్యక్షునిగా గిన్ని ఇన్ఫాంటినో తిరిగి ఎన్నికయ్యారు. ఇతర సభ్యులెవ్వరూ పోటీలో లేకపోవడం, ఇన్ఫాంటినో ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో తిరిగి ఆయనే ఈ పదవిలో కొనసాగనున్నట్లు ప్రపంచ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 52ఏళ్ల ఇన్ఫాంటినో 2016నుంచి ఫిఫా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఫిఫా అధ్యక్షుని గరిష్ట పదవీ కాలం నాలుగేళ్లు కాగా.. తొలిదఫా ఎన్నికైనప్పుడు మూడేళ్ల కాలంలో కరోనా వైరస్ సోకిన కారణంగా ఆ కాలాన్ని పరిగణలోకి తీసుకోవద్దని గవర్నింగ్ బాడీకి లేఖ రాశారు. దీంతో ఇన్ఫాంటినో వరుసగా రెండోసారి ఫిఫా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన ఈ పదవిలో 2027వరకు కొనసాగనున్నారు. ఇక ఉత్తర అమెరికా వేదికగా 2026లో జరిగే ఫిఫా ప్రపంచకప్లో ఆడే జట్ల సంఖ్యను 32నుంచి 48కు పెంచిన సంగతి తెలిసిందే.