Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేసర్ల దెబ్బకు ఆసీస్ కుదేల్ శ్రీ మిచెల్ మార్ష్ అర్ధసెంచరీ
- తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
ముంబయి: వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు భారత పేసర్ల ధాటికి 188పరుగులకే ఆలౌట్ కాగా.. ఛేదన లో భారతజట్టు ఐదు వికెట్లు కోల్పోయి 191పరుగులు చేసి గెలిచింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ హెడ్(5) నిరాశపరిచినా.. కెప్టెన్ స్మిత్, మిఛెల్ మార్ష్ కలిసి 2వ వికెట్‌కు 72పరుగులు జతచేశారు. ఆ తర్వాత స్మిత్(22) ఔటైనా.. మిఛెల్ మార్ష్(81) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఓ దశలో 4వికెట్ల నష్టానికి 169పరుగులు భారీస్కోర్ చేసేలా కనిపించింది. ఆసీస్ జట్టు 19పరుగుల వ్యత్యాసం లో చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ టాప్ స్కోరర్. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ కు మూడేసి, జడేజాకు రెండు, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ దక్కాయి.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (3)ను స్టొయినిస్ ఔట్ చేయగా.. తర్వాత విరాట్ కోహ్లీ(4), సూర్యకుమార్(0)ను వరుస బంతుల్లో స్టార్క్ ఔట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఆ దశలో క్రీజ్‌లో కుదురుకుని ఆడిన శుభమన్ గిల్(20)ను కూడా స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో భారతజట్టు 39పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్య(25)తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కానీ, కీలక సమయంలో హార్దిక్ ఔట్ కావడంతో భారత్ 83పరుగులవద్ద ఐదో వికెట్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ జడేజా- రాహుల్ కలిసి 6వ వికెట్‌కు 108 పరుగులు జతచేసి మ్యాచ్ ముగించారు. కేఎల్ రాహుల్ (75నాటౌట్), రవీంద్ర జడేజా (45నాటౌట్) కీలక పరుగులు చేశారు. దీంతో భారత్ 39.5ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191పరుగులు చేసి గెలిచింది. ఆసీస్ బౌలర్లు స్టార్క్‌కు మూడు, స్టొయినీస్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలువగా.. రెండో వన్డే విశాఖ వేదికగా ఆదివారం(19న) జరగనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జడేజాకు లభించింది.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి)సిరాజ్ 5, మిఛెల్ మార్ష్ (సి)సిరాజ్ (బి)జడేజా 81, స్మిత్ (సి)రాహుల్ (బి)హార్దిక్ 22, లబూషేన్ (సి)జడేజా (బి)కుల్దీప్ 15, ఇంగ్లిస్ (బి)షమీ 26, గ్రీన్ (బి)షమీ 12, మ్యాక్స్‌వెల్ (సి)హార్దిక్ (బి)జడేజా 8, స్టోయినీస్ (సి)శుభ్‌మన్ (బి)షమీ 5, అబట్ (సి)శుభ్‌మన్ (బి)సిరాజ్ 0, స్టార్క్ (నాటౌట్) 4, జంపా (సి)రాహుల్ (బి)సిరాజ్ 0, అదనం 10. (35.4ఓవర్లలో ఆలౌట్) 188పరుగులు. వికెట్ల పతనం: 1/5, 2/77, 3/129, 4/139, 5/169, 6/174, 7/184, 8/184, 9/188, 10/188 బౌలింగ్: షమీ 6-2-17-3, సిరాజ్ 5.4-1-29-3, హార్దిక్ 5-0-29-1, శార్దూల్ 2-0-12-0, జడేజా 9-0-46-2, కుల్దీప్ 8-1-48-1.
ఇండియా ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (ఎల్‌బి) స్టొయినీస్ 3, శుభ్‌మన్ (సి)లబూషేన్ (బి)స్టార్క్ 20, కోహ్లి (ఎల్‌బి) 4, సూర్యకుమార్ (ఎల్‌బి)స్టార్క్ 0, కేఎల్ రాహుల్ (నాటౌట్) 75, హార్దిక్ పాండ్యా (సి)గ్రీన్ (బి)స్టొయినీస్ 25, జడేజా (నాటౌట్) 45, అదనం 19. (39.5ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 191పరుగులు. వికెట్ల పతనం: 1/5, 2/16, 3/16, 4/39, 5/83 బౌలింగ్: స్టార్క్ 9.5-0- 49-3, స్టొయినీస్ 7-1-27-2, అబట్ 9-0- 31-0, గ్రీన్ 6-0-35-0, జంపా 6-0-37-0, మ్యాక్స్‌వెల్ 2-0-7-0.