Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మాస్టర్ అథ్లెట్ ఎ.ఆర్ రావు టెన్నిస్‌లో సత్తా చాటుతున్నారు. 70 ఏండ్ల వయసులో వరుస టోర్నీల్లో పతకాలు సాధించారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 400కె ఐటీఎఫ్, నాసిక్‌లో జరిగిన 100కె ఐటిఎఫ్ టోర్నమెంట్లలో సూరిబాబు రాజు భాగస్వామిగా ఎ.ఆర్ రావు డబుల్స్‌లో టైటిల్స్ కొట్టారు. నాసిక్ ఐటిఎఫ్ పురుషుల 70 ప్లస్ విభాగం ఫైనల్లో 6-2, 4-6, 10-4తో డి.ఎస్ రామారావు, సుశీల్ గుజరాతీలపై గెలుపొందారు. వరుస టోర్నీల్లో పతకాలు సాధించిన ఎ.ఆర్ రావును నార్త్ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి, సూర్య టెన్నిస్ అకాడమీ క్రీడాకారులు సత్కరించారు.