Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లవ్లీనా, మనీశ, నీతూ సైతం..
- ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : భారత బాక్సింగ్ సూపర్‌స్టార్, డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ వరుస ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భిన్న విభాగాల్లో పసిడి సొంతం చేసుకున్న బాక్సర్‌గా నిలిచేందుకు మరో అడుగు ముందుకేసింది. మహిళల 52 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతున్న నిఖత్ జరీన్.. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న ఐబీఏ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర ్ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగం ప్రీ క్వార్టర్ఫైనల్లో నిఖత్ జరీన్ ముచ్చ టగా మూడోసారి ఏకపక్ష విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్స్ బౌట్లో మెక్సికో బాక్సర్ ఫాతిమా ఫెర్రిరాపై ఏకపక్ష విజయం సాధించింది. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లు విసిరిన నిఖత్ జరీన్ ఐదుగురు న్యాయ మూర్తుల ఏకగ్రీవ విజేతగా నిలిచింది. 5-0తో మెక్సికో బాక్సర్‌ను చిత్తు చేసింది. కీలక క్వార్టర్ఫైనల్లో థారు లాండ్ బాక్సర్తో నిఖత్ జరీన్ తలపడనుంది. 57 కేజీల విభాగంలో మనీశ నాకౌట్ విజయం సాధించింది!. మూడో రౌండ్ మధ్యలోనే బౌట్‌ను ఆపేసిన రిఫరీలు మనీశను విజేతగా ప్రకటించారు. టర్కీ బాక్సర్ తుర్హన్ నుర్పై మనీశ తిరుగులేని ఆధి పత్యం చూపించింది. 48 కేజీల విభాగంలో యువ బాక్సర్ నీతూ అదరగొట్టింది. తజకిస్థాన్ బాక్సర్ సుమైయను చిత్తు చేసింది. తొలి రౌండ్లోనే రిఫరీలు నీతూను ఆర్ఎస్సీ ప్రకారం విజేతగా ప్రకటించారు. టర్కీ బాక్సర్‌ను దిమ్మదిరిగే పంచ్ ఇచ్చిన నీతూ క్వార్టర్ఫైనల్లోకి చేరుకుంది. 75 కేజీల విభాగంలో ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ 5-0తో మెక్సికో బాక్సర్‌ను చిత్తు చేయగా.. 52 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఐదో సీడ్ జాజిరాను 5-0తో ఓడించి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.