Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్లో పని భారంపై రోహిత్ శర్మ
చెన్నై : ఐపీఎల్16లో పని భారం మేనేజెమెంట్ బాధ్యత ఆటగాళ్లదేనని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. వరల్డ్కప్ కోసం ఫిట్నెస్ నిలుపుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'భారత క్రికెటర్ల పని ఒత్తిడి, పని భారం మేనేజ్మెంట్ బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఐపీఎల్ ప్రాంఛైజీల చేతుల్లోనే ఉంది. ఐపీఎల్ సమయంలో ఆటగాళ్లను ప్రాంఛైజీలు సొంతం చేసుకున్నాయి. వరల్డ్కప్ ప్రాబబుల్స్ జాబితాలో ఉన్న ఆటగాళ్ల వినియోగంపై జట్లకు ఇప్పటికే సమాచారం అందించాం. కానీ, అంతిమంగా ప్రాంఛైజీలు, ఆటగాళ్లే ఈ అంశంలో నిర్ణయం తీసుకోవాలి. జట్టులో ఎవరూ చిన్నవారు లేరు, ఫిట్నెస్ గురించి వారికే బాగా తెలుసు. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలి. 1-2 మ్యాచులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కానీ ఇది జరుగుతుందని నేను అనుకోవటం లేదు. ప్రపంచకప్లో కీలకంగా మారనున్న క్రికెటర్లు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకుని ఐపీఎల్లో ఫిట్నెస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయంలో ఆటగాళ్లదే బాధ్యత' అని రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మూడు మ్యాచుల్లోనూ తొలి బంతికే వికెట్ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్కు రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. ' ఈ విషయాన్ని ఎలా చూడాలో నాకు తెలియదు. కానీ సూర్య కుమార్ మూడు మంచి బంతులకు అవుటయ్యాడు. సూర్య స్పిన్ బాగా ఆడతాడు. చివరి 15-20 ఓవర్లు అతడి ఆట శైలికి సరిపోతాయి. అందుకు అతడికి చివరన బ్యాటింగ్కు పంపించామని' అని రోహిత్ అన్నాడు.