Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనామాపై అర్జెంటీనా గెలుపు
బ్యూనోస్‌ఎయిర్స్ : సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సి మరో రికార్డు బద్దలు కొట్టాడు. కెరీర్ 800 గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పోర్చుగల్ హీరో క్రిస్టియానో రొనాల్డో 800 కెరీర్ గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలసిందే. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా.. ఫ్రాన్స్‌తో ఫైనల్ అనంతరం తొలిసారి బరిలోకి దిగింది. సొంతగడ్డపై పనామాను 2-0తో చిత్తు చేసి ఫిఫా ప్రపంచకప్ విజయాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకుంది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాకు ఆఖరు వరకు గోల్ నిరాకరించిన పనామా.. లియోనల్ స్కాలోని శిబిరంలో ఉత్కంఠకు తెరతీసింది. 78వ నిమిషంలో 21 ఏండ్ల యువ మిడ్ ఫీల్డర్ థియాగో ఆల్మాడా గోల్ చేసి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 89వ నిమిషంలో ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలిచిన లియోనల్ మెస్సీ.. అర్జెంటీనా అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చాడు. మెస్సీ గోల్‌తో ఆ జట్టు ఆటగాళ్లు, కోచ్ కుటుంబంతో సహా మైదానంలోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. ఈ గోల్‌తో మెస్సి కెరీర్ రికార్డు గోల్ నమోదు చేశాడు.