Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్
భోపాల్ : ఇటీవల కైరోలో జరిగిన ప్రపంచకప్‌లో పసిడి నెగ్గిన రుద్రాంక్ష్ పాటిల్.. భోపాల్‌లో గోల్డ్ రేసులో ఫేవరేట్‌గా నిలిచాడు. ఇటీవల టోర్నీల్లో ఎన్నడూ 9 స్కోర్లు నమోదు చేయని రుద్రాంక్ష్ పాటిల్ భోపాల్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో తడబాటుకు గురయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం తొలి రౌండ్లోనే 9.9, 10.1 స్కోర్లతో మొదలెట్టిన రుద్రాంక్ష్ ఓ దశలో ఎలిమినేషన్ ప్రమాదంలో ఎదుర్కొన్నాడు. 20 షాట్ల అనంతరం నాల్గో స్థానంలోకి చేరుకున్న రుద్రాంక్ష్ తక్కువ స్కోర్లు నమోదు చేసినా చివర్లో పుంజుకుని కాంస్య పతకం దక్కించుకున్నాడు. చైనా షూటర్ షెంగ్ లియావో పసిడి పతకం సాధించగా, చైనాకే చెందిన డు లిన్షు సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో ఓవరాల్‌గా చైనా ఐదు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్య పతకాతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ ఓ పసిడి, ఓ రజతం, మూడు కాంస్య పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది.