Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : భారత్ అతి త్వరలోనే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వగల స్థాయిలో మౌళిక సదుపాయాలు కలిగి ఉండటం, ఒలింపిక్ బిడ్‌ను విజయవంతంగా దక్కించుకునే స్థితిలో ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 'ఖేలో ఇండియా క్రీడల ద్వారా మూడు స్థాయిల్లో శిక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయగలిగాం. గత 18 నెలలుగా అన్ని క్రీడాంశాల్లో మహిళలకు ఖేలో ఇండియా లీగ్స్ నిర్వహించాం. మహిళలకు మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు 10కా దమ్ కార్యక్రమం 50 నగరాల్లో నిర్వహించాం. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ విజయవంతమైంది. రానున్న కాలంలో మరిన్ని క్రీడాంశాల్లో మహిళల లీగ్‌లకు ఏర్పాటుకు డబ్ల్యూపీఎల్ మార్గం చూపింది. క్రీడలు రాష్ట్ర జాబితా. క్రీడాభివృద్దిలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని' అనురాగ్ ఠాకూర్ అన్నారు. 'ది హిందూ' జాతీయ క్రీడా సదస్సులో పాల్గొన్న ఠాకూర్ క్రీడల్లో మహిళలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తపరిచారు.