Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రామ్‌దాస్ ఆల్ ఇండియా ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్‌సీ రన్నరప్‌గా నిలిచింది. టైటిల్ పోరులో హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్‌సీ, కెఎస్‌ఏ ముంబయి 90 నిమిషాల ఆటలో గోల్ చేయటంలో విఫలమయ్యాయి. అదనపు సమయంలోనూ ఫలితం తేలలేదు. దీంతో పెనాల్టీ షుటౌట్ ద్వారా విజేతను తేల్చారు. టైబ్రేకర్‌లో హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్‌సీ 4-5తో టైటిల్‌ను చేజార్చుకుంది. అబ్దుల్ ఖాదర్ (ఉత్తమ ఫార్వర్డ్), వికాస్ యాదవ్ (ఉత్తమ మిడ్ ఫీల్డర్)గా నిలువగా.. రన్నరప్‌గా హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్‌సీ రూ.50000 నగదు బహుమతి అందుకుంది.