Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో సైనా, శ్రీకాంత్ సైతం
- నేటి నుంచి స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ
మాడ్రిడ్ (స్పెయిన్) : గత కొంత కాలంగా భారత బ్యాడ్మింటన్‌లో పతకాల జోరు తగ్గింది. సైనా నెహ్వాల్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుండగా, పి.వి సింధు గాయం అనంతరం ఫామ్ సాధించలేదు. కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ సహా హెచ్.ఎస్ ప్రణరు అంచనాలను అందుకోవటం లేదు. డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ నిలకడగా రాణిస్తుండగా, ఇటీవల ఆల్ ఇంగ్లాండ్‌లో గాయత్రి, జాలీ జంట సెమీస్‌కు చేరుకుని ఆకట్టుకుంది. ఒలింపిక్ అర్హత ప్రక్రియ, పారిస్ ఒలింపిక్స్ ముంగిట భారత షట్లర్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ వేదికగా పి.వి సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌పై గురి పెట్టారు. నేటి నుంచి ఆరంభం కానున్న సూపర్ 300 టోర్నీలో డబుల్స్‌లో భారత్ పతకాలు ఆశిస్తోంది. వరల్డ్ నం.9, రెండో సీడ్ సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. ప్రీ క్వార్టర్స్ వరకు సింధుకు సవాల్ ఎదురుకాదు!. సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్‌లోనే మూడో సీడ్ బుసానన్ (థారులాండ్)తో తలపడనుంది. మాళవిక బాన్సోద్, ఆకర్షి కశ్యప్‌లు సైతం ఉమెన్స్ సింగిల్స్ బరిలో ఉన్నారు. మెన్స్ సింగిల్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ తొలి మ్యాచ్‌లో థారులాండ్ షట్లర్ తమసిన్తో తలపడనుండగా, బి. సాయిప్రణీత్‌కు నెదర్లాండ్స్ షట్లర్ ఎదురు కానున్నాడు. మిథున్ మంజునాథ్, సమీర్ వర్మలు సైతం ఆడనున్నారు. లక్ష్యసేన్, ప్రణరులు టోర్నీకి దూరంగా ఉన్నారు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీలకు తొలి రౌండ్లో జపాన్ షట్లర్లు సవాల్ విసరనుండగా, మహిళల డబుల్స్‌లో ఆరో సీడ్ గాయత్రి, ట్రెసా జంట సైతం జపాన్ జోడీతో ఢతోీనే టైటిల్ వేట మొదలెట్టనుంది.