Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ
మాడ్రిడ్ : భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుంది. ఈ ఏడాది బరిలో నిలిచిన నాలుగు టోర్నీల్లోనూ తేలిపోయిన సింధు.. తాజాగా మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్‌లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఇండియా ఓపెన్, మలేషియా ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్, స్విస్ ఓపెన్‌లో సింధు అంచనాలను అందుకోలేదు. స్విస్ ఓపెన్‌లో ఏకంగా అనామక షట్లర్ చేతిలో పరాజయం పాలైంది. చీలమండ గాయంతో నిరుడు ద్వితీయార్థం సీజన్‌కు పూర్తిగా దూరమైన సింధు.. పూర్తి ఫిట్నెస్ సాధించినా.. కోర్టులో మునుపటి దూకుడు కనిపించటం లేదు. మహిళల సింగిల్స్ విభాగంలో స్విట్జర్లాండ్ షట్లర్‌తో నేడు సింధు తలపడనుంది. ఇటీవల సింధుపై విజయాలు సాధించిన కుసుమ, బ్లిచ్ఫిట్లు సెమీస్‌కు ముందు సవాల్ విసరనున్నారు. పేలవ ఫామ్‌తో 2016 తర్వాత తొలిసారి డబ్ల్యూబిఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు కోల్పోయిన పి.వి సింధు మాడ్రిడ్‌లో మెరవటంపైనే దృష్టి నిలిపింది. మెన్స్ సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్, బి. సాయి ప్రణీత్ టైటిల్ ఆశలు పెట్టుకోగా.. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలీ, గాయత్రి పుల్లెల నేడు తొలి రౌండ్ మ్యాచుల్లో బరిలోకి దిగనున్నారు. ఇక వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీకి సైతం దూరమైంది.