Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోకాలి నొప్పితో వాకోవర్
- శ్రీకాంత్, సాయిప్రణిత్ ముందంజ
- స్పెయిన్ మాస్టర్స్ 300
మాడ్రిడ్ : భారత డబుల్స్ స్టార్, స్విస్ ఓపెన్ చాంపియన్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి గాయానికి గురయ్యాడు!. స్విస్ ఓపెన్ విజయం అనంతరం మూడు రోజుల వ్యవధిలోనే స్పెయిన్ మాస్టర్స్ 300 టోర్నీలో బరిలోకి దిగిన సాత్విక్, చిరాగ్ జోడీ.. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో మధ్యలోనే వాకోవర్ ఇచ్చింది. 9-11తో తొలి గేమ్‌లో వెనుకంజ వేసిన సాత్విక్, చిరాగ్ జంట.. విరామ సమయంలో చైర్ అంపైర్‌కు మోకాలి గాయం గురించి ఫిర్యాదు చేశారు. కోచ్ మథియస్ బోయె సైతం సాత్విక్‌తో చేరాడు. విరామం లేకుండా వరుస మ్యాచులతో అలసట, గతంలో వేధించిన మోకాలి గాయం సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి వాకోవర్ ఇచ్చేందుకు దోహదం చేస్తుంది. సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి ఫిట్‌నెస్‌పై బారు నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ఇక మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో 21-11, 25-27, 23-21తో థారులాండ్ షట్లర్‌పై వరుస టైబ్రేకర్లలో అదరగొట్టే విజయం సాధించాడు. బి. సాయిప్రణిత్ 21-16, 18-21, 21-12తో మూడు సెట్ల పోరులో పైచేయి సాధించి ముందంజ వేశాడు. కిరణ్ జార్జ్ 21-16, 21-14తో సహచర భారత షట్లర్ మిథున్ మంజునాథ్‌పై పైచేయి సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 12-21, 21-15, 21-18తో ఆరో సీడ్ మిచెలీ లీ (కెనడా)పై మెరుపు విజయం సాధించింది. తొలి గేమ్‌లో వెనుకంజ వేసినా.. వరుస గేముల్లో గెలుపొంది స్టార్ షట్లర్‌కు షాక్ ఇచ్చింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జంట తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. ఆల్ ఇంగ్లాండ్‌లో సెమీస్‌కు చేరుకున్న ఈ జోడీ.. వరుసగా స్విస్, స్పెయిన్‌లో ఆరంభంలోనే నిష్క్రమించింది. జపాన్ జోడీ 21-18, 21-16తో గాయత్రి, ట్రెసాలపై వరుస గేముల్లో గెలుపొందింది.