Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైబ్రిడ్ మోడల్ ఆతిథ్యంపై పీసీబీ
లాహోర్ : 2023 ఆసియా కప్‌లో అనుసరిస్తున్న హైబ్రిడ్ మోడల్‌ను 2023 వన్డే వరల్డ్‌కప్‌లోనూ అమలు చేయాలని కోరలేదని, అసలు అటువంటి చర్చ చోటుచేసుకోలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ నజీం సేథి తెలిపారు. పీసీబీ మాజీ సీఈవో, ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీం ఖాన్ ఇటీవల ఓ పాక్ చానల్‌తో మాట్లాడుతూ.. ' ఆసియా కప్ కోసం భారత్ పాక్‌కు రావటం లేదు. వన్డే వరల్డ్‌కప్ కోసం పాక్ సైతం అక్కడికి వెళ్లదనుకుంటా. ఆసియాకప్ తరహాలోనే వరల్డ్‌కప్‌లోనూ హైబ్రిడ్ మోడల్ తప్పదేమో. పాక్ మ్యాచులను తటస్థ వేదికపై నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేయవచ్చు' అని తెలిపారు. ఆసియా కప్‌లో ఆడేందుకు భారత జట్టు పాక్ పర్యటనకు రాకుంటే.. వన్డే వరల్డ్‌కప్‌కు పాక్ సైతం ఆ దేశానికి వెళ్లబోదని గతంలో పీసీబీ చైర్మెన్లు హెచ్చరించిన నేపథ్యంలో వసీం ఖాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కానీ 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్థాన్.. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. హైబ్రిడ్ మోడల్ ఆసియా కప్‌కు మాత్రమే పరిమితం. వన్డే వరల్డ్‌కప్ గురించి ఎటువంటి చర్చ లేదు. ఐసీసీ వేదికపై చర్చ చేపట్టలేదని శుక్రవారం సేథి తెలిపారు.