Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం అదిరింది. మూడేండ్ల విరామం అనంతరం స్వదేశీ అభిమానుల మధ్యకు వచ్చిన ధనాధన్ క్రికెట్ లీగ్ 16వ సీజన్ శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరెంద్ర మోడీ స్టేడియంలో అట్టహాసంగా మొదలైంది. ఆరంభ వేడుకలకు సినీ తారల నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. పాన్ ఇండియా చిత్రాలు పుష్ప ఫేం రష్మిక మందన, బాహుబలి ఫేం తమన్నా భాటియాలు పాపులర్ పాటలకు తమదైన నృత్యాలతో అభిమానులకు సూపర్ కిక్ అందించారు. సంగీతకారుడు అరిజిత్ సింగ్ పాటలతో స్టేడియం హోరెత్తింది. ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రోఫీని మైదానంలోకి తీసుకువచ్చాడు. ఆరంభ మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బగ్గీల్లో అభిమానుల కేరింతల నడుమ మైదానంలోకి వచ్చారు.