Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ : సెర్బియా యోధుడు, టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. కోవిడ్-19 టీకా తీసుకోని జకోవిచ్ నిబంధనల కారణంగా గత నెల యుఎస్ టోర్నీల్లో ఆడలేదు. ఇండియన్స్ వెల్స్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఏటీపీ వరల్డ్ నం.1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. తాజాగా మియామీ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాజ్ సెమీఫైనల్లో నిష్క్రమించటంతో నొవాక్ జకోవిచ్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అల్కరాజ్ రెండో స్థానంలో నిలువగా, గ్రీసు కుర్రాడు స్టెఫానోస్ సిట్సిపాస్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వదేవ్ నాల్గో ర్యాంక్ సాధించాడు. ఇక ఇండియన్ వెల్స్ టైటిల్‌తో రికార్డు నెలకొల్పిన రోహన్ బోపన్న మెన్స్ డబుల్స్‌లో రెండు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. యూకీ బాంబ్రి (73), సాకెత్ మైనేని (75) రెండేసి స్థానాలు మెరుగయ్యారు. మెన్స్ సింగిల్స్‌లో సుమిత్ నాగల్ రెండు స్థానాలు మెరుగై 372వ స్థానంలో నిలిచాడు.