Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూపీఎల్‌పై అరుణ్ ధుమాల్
ముంబయి : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రానున్న మూడు సీజన్ల పాటు ఐదు జట్ల టోర్నీగానే కొనసాగుతుందని ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ కుమార్ ధుమాల్ అన్నారు. 'డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లోనే మంచి విజయం సాధించింది. రానున్న సీజన్లలో డబ్ల్యూపీఎల్ మరింత మెరుగవుతుంది. జట్లను పెంచాలనే ఆలోచన ఉన్నప్పటికీ మరో మూడు సీజన్ల పాటు ఐదు టీమ్‌లే ఉంటాయి. ప్రాంఛైజీలు ఫ్యాన్ బేస్ పెంచుకునేందుకు ఇంటా, బయటా ఫార్మాట్లో మ్యాచులను నిర్వహిస్తాం. వచ్చే సీజన్ నుంచే ఐదు జట్లు ఈ ఫార్మాట్లో మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అందుకోసం బీసీసీఐ ఆసక్తిగా కసరత్తు చేస్తోంది. డబ్ల్యూపీఎల్ గ్లోబల్ టోర్నీ. అందరికి అనువైన సమయంలో డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ చేసేందుకు చూస్తున్నామని' అరుణ్ కుమార్ ధుమాల్ అన్నారు.