Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం
ముంబయి : భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నుపూస గాయానికి శస్త్రచికిత్సకు వెళ్లనున్నాడు. వెన్నునొప్పితో ఆస్ట్రేలి యాతో వన్డేలకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహించే అవకాశానికి సైతం దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రత దృష్ట్యా అతడికి విదేశాల్లో శస్త్రచికిత్సకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. త్వరలోనే శ్రేయస్ అయ్యర్ శస్త్రచికిత్స కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లే అవకాశం ఉంది. సర్జరీ అనంతరం మూడు నెలలు విరామం తీసుకోనున్న అయ్యర్.. ఆ తర్వాతే ప్రాక్టీస్‌పై ఆలోచన చేయనున్నాడు. ఐపీఎల్ 16 సహా జూన్ తొలి వారంలో జరుగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు సైతం అయ్యర్ దూరం కానున్నాడు. గాయాలతో జశ్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌లు ఇప్పటికే ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.