Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : సన్రైజర్స్ హైదరాబాద్కు రెండో ఓటమి. తొలుత లక్నో స్పిన్నర్ల మాయతో బ్యాటర్లు చేతులెత్తేయగా సన్రైజర్స్ హైదరాబాద్ 121/8 పరుగులే చేసింది. ఇక ఛేదనలో వికెట్లు చేజార్చుకున్నా.. 16 ఓవర్లలోనే 127/5 పరుగులు చేసిన లక్నో సూపర్జెయింట్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది లక్నోకు రెండో విజయం కాగా, హైదరాబాద్కు రెండో పరాజయం. లక్నో స్పిన్నర్ కృనాల్ పాండ్య (3/18)'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. లక్నో బ్యాటర్లలో కెఎల్ రాహుల్ (35), కృనాల్ పాండ్య (34) రాణించారు.