Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో చైనీస్ తైపీపై గెలుపు ఒర్లీన్స్ మాస్టర్స్ ఓపెన్
ఒర్లీన్స్ (ఫ్రాన్స్) : భారత బ్యాడ్మింటన్ యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ మరో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ప్రీ క్వార్టర్ఫైనల్లో టాప్ సీడ్, కెంట నిషిమోటను చిత్తు చేసిన రజావత్.. క్వార్టర్ఫైనల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేశాడు. చైనీస్ తైపీ షట్లర్ చై యు జెన్‌పై 21-18, 21-18తో వరుస గేముల్లో గెలుపొందిన రజావత్ ఒర్లీన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ మెన్స్ సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 44 నిమిషాల క్వార్టర్‌ఫైనల్ పోరులో ప్రియాన్షు రజావత్ అద్భుతంగా ఆడాడు. తొలి గేమ్‌లో 8-9 నుంచి పుంజుకున్న రజావత్ 11-9తో విరామ సమాయనికి ముందంజ వేశౄడు. ద్వితీయార్థంలో చైనీస్ తైపీ షట్లర్ నుంచి రజావత్‌కు ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. 21-18తో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గాడు. రెండో గేమ్‌లో సైతం ఆరంభంలో చై యు జెన్ నుంచి రజావత్ పోటీ చవిచూశాడు. 7-9, 10-8తో రజావత్ వెనుకంజ వేశాడు. 11-10తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన ప్రియాన్షు సెకండ్‌హాఫ్‌లో వెనక్కి తగ్గలేదు. వరుస పాయింట్లతో 21-18తో రెండో గేమ్‌ను, సెమీఫైనల్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. నేడు సెమీస్ పోరులో ఐర్లాండ్ షట్లర్‌తో రజావత్ పోటీపడనున్నాడు.