Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై చెన్నై ఘన విజయం
ముంబయి : ఐపీఎల్ దిగ్గజాల పోరులో సూపర్‌కింగ్స్ పైచేయి సాధించింది. స్పిన్నర్లు జడేజా (3/20), శాంట్నర్ (2/28) మాయజాలంతో తొలుత ముంబయి ఇండియన్స్ 157/8 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్ (32), టిమ్ డెవిడ్ (31), తిలక్ వర్మ (22), రోహిత్ శర్మ (21) ముంబయికి గౌరవప్రద స్కోరు అందించారు. ఛేదనలో అజింక్య రహానె (61, 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) విశ్వరూపం చూపించాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన రహానె మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. రుతురాజ్ (40 నాటౌట్), దూబె (28), రాయుడు (20 నాటౌట్) రాణించటంతో 18.1 ఓవర్లలోనే 159/3తో చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నైకి ఇది రెండో విజయం కాగా, ముంబయికి ఇది వరుసగా రెండో పరాజయం.