Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్(రష్యా): ఆసియా, ఓషేనియానియా ఈవెంట్లో ఆర్మగెడాన్ ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌గా భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ నిలిచాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో గుకేశ్ ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్పై సంచలన విజయం సాధించాడు. గేమ్-లో గుకేశ్ కొంత వెనుకబడ్డా.. ఆ తర్వాత పుంజుకొని తదుపరి గేమ్‌లో విజయం సాధించాడు.
ఇరువురి మధ్య జరిగిన ఆ తర్వాత మ్యాచ్ డ్రా అయ్యింది. నాల్గో గేమ్‌లో గుకేశ్ ప్రత్యర్ధిని ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. వీరిద్దరూ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అర్హత పోటీల్లో గెలిచి ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. ఫైనల్ పోటీల్లో 16ఏళ్ల గుకేశ్‌తోపాటు మాజీ ప్రపంచ క్లాసికల్ ఛాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్, డానియేల్ డుబోవ్, యాంఇ యు(చైనా) విదిత్ గుజరాతీ, కార్తికేయ మురళీ, పరమ్ మగ్సూద్లూ(ఇరాన్)లో తమ తమ బోర్డ్‌లలో గెలిచినా.. విజేతగా గుకేశ్ నిలిచాడు. ఆర్మగెడాన్ గేమ్‌లో తెలుపు పావులతో ఆడే ప్లేయర్‌కు ఐదు నిమిషాలు, నలుపు పావులతో ఆడే ప్లేయర్‌కు నాలుగు నిమిషాలు కేటాయిస్తారు. నలుపు పావులతో ఆడిన గుకేశ్.. ఉజ్బెకిస్తాన్ ప్లేయర్‌ను ఓడించడం విశేషం.