Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023-24 దేశవాళీ షెడ్యూల్
- జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ
ముంబయి : భారత క్రికెట్ దేశవాళీ సీజన్ ఈ ఏడాది కాస్త ముందుగానే ఆరంభం కానుంది. మూడేండ్ల అనంతరం దేవదర్ ట్రోఫీ పున ప్రారంభం కానుండగా, దులీప్ ట్రోఫీతో దేశవాళీ క్రికెట్ షురూ అవనుంది. దులీప్ ట్రోఫీ, దేవదర్ ట్రోఫీల్లో ఆరు జోన్ల జట్లు పోటీపడతాయి. సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ఈస్ట్ జోన్లు ఈ రెండు టోర్నీల్లో పోటీపడతాయి. దులీప్ ట్రోఫీ జూన్ 28 నుంచి ఆరంభం కానుండగా, ఇరానీ కప్ అక్టోబర్ 1 నుంచి జరుగనుంది. సౌరాష్ట్రతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ కప్ కోసం ఆడనుంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ జనవరి 5-మార్చి 14 వరకు సాగనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16-నవంబర్ 6.. విజరు హజారే ట్రోఫీ నవంబర్ 23-డిసెంబర్ 15 వరకు జరుగనున్నాయి. రంజీ ట్రోఫీ, విజరు హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో 38 జట్లు పోటీపడనున్నాయి. రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్లో నాలుగు గ్రూపుల్లో ఎనిమిదేసి జట్ల చొప్పున 32 టీమ్స్ పోటీపడనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ప్రతి గ్రూప్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు ప్లేట్ డివిజన్‌కు పడిపోతాయి. ప్లేట్ డివిజన్లో ఆరు జట్లు ఆడనుండగా.. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో, ఆ తర్వాత గ్రూప్ ఫైనల్లో ఆడతాయి. దేశవాళీ మహిళల క్రికెట్ సీజన్ అక్టోబర్ 19-నవంబర్ 9న టీ20 ట్రోఫీతో ఆరంభం కానుంది. ఇంటర్ జోనల్ ట్రోఫీ (నవంబర్ 14-డిసెంబర్ 4), వన్డే ట్రోఫీ (జనవరి 4-26) ఈ సీజన్లో షెడ్యూల్ చేశారు. 2023-24 దేశవాళీ సీజన్లో ఓవరాల్‌గా 1846 మ్యాచులు ఉండనున్నాయి. ఇక ఈ ఏడాది రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎలైట్ నుంచి దిగజారి ప్లేట్ విభాగంలో ఆడనున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో హైదరాబాద్ ఎలైట్ గ్రూప్-బిలో చివరి స్థానంలో నిలిచింది.