Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి
న్యూఢిల్లీ: ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ మురిసింది. ఛేదనలో బ్యాటర్లు రాణించటంతో హ్యాట్రిక్ పరాజయం నుంచి బయటపడింది. ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై మెరుపు విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (65, 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (31, 26 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన రోహిత్.. తెలుగు తేజం తిలక్ వర్మ (41, 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు)తో కలిసి ముంబయిని గెలుపు దిశగా నడిపించాడు. సూర్యకుమార్ యాదవ్ (0), తిలక్, రోహిత్‌లు వరుసగా వికెట్లు చేజార్చుకోగా.. మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. క్యాపిటల్స్ పేసర్ ఎన్రిచ్ నోకియా తొలి ఐదు బంతులకు 3 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి రెండు పరుగులు సాధించిన టిమ్ డెవిడ్ (13 నాటౌట్, 11 బంతుల్లో 1 సిక్స్), కామెరూన్ గ్రీన్ (17 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సీజన్లో ముంబయి ఇండియన్స్‌కు తొలి విజయం అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్ (54, 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ డెవిడ్ వార్నర్ (51, 47 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ శతకాలు బాదటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో జేసన్ బెహాన్‌డార్ఫ్ (3/23), పియూశ్ చావ్లా (3/22) మూడు వికెట్ల ప్రదర్శనతో మెరిశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా నాల్గో పరాజయం.