Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవల హైదరాబాద్‌లోని యాకత్‌పురాలో తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ధన్వాడ గిరిజన బిడ్డలు సత్తా చాటారు. బాలికల 49 కిలోల విభాగంలో గీత, బాలికల 57 కిలోల విభాగంలో నాగలక్ష్మి బంగారు పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరిసి ఏప్రిల్ 16-18న ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగే జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన ధన్వాడ గిరిజన బిడ్డలను మాజీ మంత్రి డి.కె అరుణ అభినందించారు. జాతీయ పోటీలకు వెళ్లేందుకు గీత, నాగలక్ష్మీలకు ఈ సందర్భంగా అవసరమైన సహాయం అందజేశారు.