Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్లో ఆడుతున్న ఎం.ఎస్ ధోని
- సూపర్‌కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ వెల్లడి
చెన్నై : వికెట్ల మధ్య పరుగులో ఎం.ఎస్ ధోని అత్యుత్తమం. డెత్ ఓవర్లలో ఆ వేగం అందుకోవటం నాన్స్ట్రయికర్కు కష్టంతో కూడుకున్న పని. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని పరుగుపై వ్యాఖ్యాత మాథ్యూ హెడెన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకొచ్చిన ధోని.. మూడో బంతికి సింగిల్‌తో జడేజాకు స్ట్రయిక్ ఇచ్చాడు. నిజానికి ధోని ఇక్కడ రెండు పరుగులు తీసుకునేవాడు. కానీ, ఆ పని చేయలేదు. అందుకు గల కారణాన్ని సూపర్‌కింగ్స్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. ' ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఆ సంగతి అతడి కదలికల్లో గమనించవచ్చు. మోకాలి నొప్పితో అతడు పరుగు తీసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అయినా, రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని గొప్ప ప్రదర్శన చేశాడు. అతడి ఫిట్నెస్ స్థాయి ఎల్లప్పుడూ ప్రొఫెషనల్' అని ఫ్లెమింగ్ కితాబిచ్చాడు.
బెన్ స్టోక్స్, దీపక్ చాహర్, శిసిండ మంగళ.. ఇలా వరుసగా ఆటగాళ్లు గాయాలతో బెంచ్‌కు పరిమితం కావటం చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. గాయాలతో ఒకట్రెండు వారాలు ఆటకు దూరం కానున్న ఆటగాళ్లు తుది జట్టుకు ఎంపిక దూరమవుతున్నారు. ఈ సమయంలో ఉత్తమ జట్టును ఎంపిక చేయటం సూపర్‌కింగ్స్‌కు కత్తి మీద సాముగా మారింది.