Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెట్టింగ్ కంపెనీతో ఒప్పందంపై ఫిర్యాదు
లండన్ : ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఓ బెట్టింగ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించటం పట్ల ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణ ప్రక్రియ షురూ చేసింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ మార్చి 27న '22బెట్' కంపెనీతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్16 సీజన్ సందర్భంగా 22బెట్ సంస్థ ప్రకటనల్లో బ్రెండన్ మెక్‌కలమ్ కనిపిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ సంస్థ ఈసీబీకి ఫిర్యాదు చేసింది. మెక్‌కలమ్ ఒప్పందం ఈసీబీ అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘిం చేలా ఉన్నాయా? లేదా? అనే అంశంపై అంతర్గత విచారణ చేపట్టనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం బెట్టింగ్ సంస్థతో ఒప్పందం రూల్స్‌కు విరుద్ధమని తేలితే.. మెక్‌కలమ్ ఒప్పందం రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ టెస్టు జట్టు చీఫ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కలమ్ 12 టెస్టుల్లో 10 విజయాలు సాధించి విమర్శల ప్రశంసలు సైతం పొందుతున్నారు.