Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్ఏ క్రికెట్లో సరికొత్త జోష్
దుబాయ్ : అమెరికాలో క్రికెట్‌కు సరికొత్త ఉత్సాహం. ఈ ఏడాది రెండు క్రికెట్ లీగ్‌లకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆమోదం లభించింది. ఈ మేరకు ఐసీసీ, లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో యుఎస్ఏలో రెండు టీ20 లీగ్‌లు ఆరంభం కానున్నాయి. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ), మైనర్ లీగ్ క్రికెట్ (ఎంఐఎల్సీ)లకు ఐసీసీ అనుమతి లభించటంతో షెడ్యూల్ ప్రకారం లీగ్‌లు జరుగనున్నాయి. మేజర్ క్రికెట్ లీగ్ ఆటగాళ్ల వేలం మార్చిలో జరిగింది. ఐసీసీ అనుమతి లభించటంతో అంతర్జాతీయ క్రికెటర్లు ఈ లీగ్‌ల్లో పాల్గొనేందుకు అడ్డంకి తొలగింది. ఐసీసీ అనుమతి ఇచ్చిన క్రికెట్ లీగ్‌ల్లో ఆడేందుకు మాత్రమే ఐసీసీ సభ్య దేశాల బోర్డులు క్రికెటర్లకు నిరభ్యంతర పత్రాలు అందజేస్తున్నాయి.