Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా టెస్టు జట్టు
మెల్బోర్న్ : పరుగుల వేటలో నిలకడ కోల్పోయిన ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ కీలక ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో చోటు సాధించాడు. జూన్ 7 నుంచి ది ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాలు 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పోటీపడనున్నాయి. పేసర్ పాట్ కమిన్స్ సారథ్యంలో 17 మందితో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. యాషెస్ సిరీస్‌కు 17 మంది బృందం ఖరారు కాగా.. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మాత్రం 15 మందిని మాత్రమే ఎంపిక చేయాలి.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు : ఖవాజ, వార్నర్, మాథ్యూ రెన్షా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), ట్రావిశ్ హెడ్, అలెక్స్ కేరీ, జోశ్ ఇంగ్లీశ్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హాజిల్‌వుడ్, స్కాట్ బొలాండ్, లయాన్, టాడ్ మర్ఫీ.