Authorization
Mon Jan 19, 2015 06:51 pm
7హెచ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జిహెచ్ఎంసి స్విమ్మింగ్‌పూల్‌లో నిర్వహించిన స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఫ్రీస్టయిల్, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, బటర్‌ఫ్లై విభాగాల్లో అండర్-10 నుంచి అండర్-17 గర్ల్స్, బార్సుకు పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, స్విమ్మర్ గోలి శ్యామల, జిహెచ్ఎంసి స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టర్ బి.వెంకటేశ్ బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.