Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్‌తో నైట్‌రైడర్స్ ఢీ
- మరో మ్యాచ్‌కు ముస్తాబైన ఉప్పల్
నవతెలంగాణ-హైదరాబాద్ :
ఆరంభంలో అద్భుత విజయాలతో అభిమానుల దృష్టిని తనవైపునకు తిప్పుకున్న జట్టు కోల్‌కత నైట్‌రైడర్స్. తొలుత ఓటమి పాలైనా..తర్వాత వరుస విజయాలతో అంచనాలను పెంచిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్రథమార్థం మ్యాచులు ముగిసిన అనంతరం ఫామ్, లయ తప్పిన జట్ల జాబితాలో ముందున్నాయి సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్‌రైడర్స్. 9 మ్యాచుల్లో 3 విజయాలతో కోల్‌కత నైట్‌రైడ ర్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలువగా..8 మ్యాచుల్లో 3 విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. తాజాగా నేడు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ ముఖా ముఖి సమరానికి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకేందుకు ఇరు జట్లు దృష్టి సారించా యి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నేడు హైదరాబాద్, కోల్‌కత కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి.
గాడిలో పడతారా? : సీజన్ ఆరంభంలో వరుస ఓటములకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యం కారణమైంది. కానీ కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 200 ప్లస్ పరుగులు దంచికొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలక్ చెక్ పెట్టింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ శతకం సాధించాడు. కానీ ఆ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కథ మళ్లీ మొదటికొచ్చింది. మరోసారి కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మళ్లీ గాడిలో పడేందుకు ఎదురుచూస్తుంది. కెప్టెన్ ఎడెన్ మార్క్ రామ్, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్‌లు బ్యాటింగ్ లైనప్‌లో కీలకం కానుండగా.. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్‌లు రాణిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండ దు. భువనేశ్వర్ కుమార్, తంగరసు నటరాజన్, మార్కో జాన్సెన్లు పేస్ విభాగంలో ఫామ్‌లో ఉన్నారు. మయాంక్ మార్కండె మాయజాలం జోరుగా సాగుతోం ది. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిం ది. సొంత మైదానంలో ఓడినా, కోట్ల స్టేడియంలో విజయం నమోదు చేసింది. ఉప్పల్‌లో జరిగిన చివరి రెండు మ్యాచుల్లో ఛేదనలో తడబాటుకు లోనైన సన్‌రైజర్స్ హైదరాబా ద్.. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌తో తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపేందుకు అవకాశం ఉంది. ఇక కోల్‌కత నైట్‌రైడర్స్ తాజా సీజన్లో అంచనాలను అందుకోలేదు. కీలక ఆటగాడు అండ్రీ రసెల్ ఇంకా ఫామ్ సాధించలేదు. అయినా, ఇతర ఆటగాళ్లు మెరుపు ప్రదర్శనలు నమోదు చేస్తున్నారు. నితీశ్ రానా, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. కానీ ఏ మ్యాచ్‌లో బ్యాటర్లు సమిష్టిగా మెరవటం లేదు. ఇది కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ప్రతికూలం గా మారింది. కోల్‌కత నైట్‌రైడర్స్ మరో బలం స్పిన్. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిల కు తోడు సుయాశ్ శర్మ రూపంలో మూడో మిస్టరీ స్పిన్నర్ అందుబాటులోకి వచ్చాడు. ఈ ముగ్గురి 12 ఓవర్లను కాచుకోవటం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నేడు అతిపెద్ద సవాల్.