Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: గాయపడ్డ కేఎల్ రాహుల్ ఈ సీజన్ ఐపిఎల్ మిగతా మ్యాచ్‌లనుంచి, వచ్చే నెలలో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌కూ దూరమ య్యాడు. ఈమేరకు లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం ఇన్‌స్ట్రాగ్రామ్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. 'బిసిసిఐ వైద్యబృందం నిశితంగా పరిశీలించిన అనంతరం కేఎల్ రాహుల్ తొడకు శస్త్రచికిత్స, ఆర్గో అవసరమైన డాక్టర్లు తెలుపగా.. కేఎల్ రాహుల్ అందుకు అంగీకరిం చడంతో అతనికి కనీసం రెండు నెల లు విశ్రాంతి కావల్సి ఉంటుం దని వైద్యులు తెలిపారు. దీంతో లక్నో సూపర్ జెయింట్ ఫ్రాంచైజీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్‌కు వెళ్లే బంతిని ఆపే క్రమంలో కేఎల్ రాహుల్ కుడికాలు తొడ కండరాలు పట్టేయడంతో మైదానంలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే.