Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 వికెట్లు కూల్చిన హెరాత్
గాలే : శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎదురీదు తోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 484 పరుగుల భారీ స్కోరుకు సమాధానంగా విండీస్ 251 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఫాలో ఆన్‌లో పడిన విండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. బ్రావో 20 పరుగులతో ఆడుతున్నాడు. మూడో రోజు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో డారెన్ బ్రావో (50, 8 ఫోర్లు, 1 సిక్స్‌్) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. లంక బౌలర్ రంగన హెరాత్ 6 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. మరో రెండు రోజులు మిగిలి ఉండడంతో విండీస్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే అద్భుతం జరగక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.