Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్ఎల్పై పాక్ కోచ్ వకార్ వ్యాఖ్య
కరాచీ : పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పై పాక్ చీఫ్ కోచ్ వకార్ యూనీస్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఐపీఎల్ తరహాలో పీఎస్ఎల్ తొలి సీజన్లోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌ను తయారు చేయలేదని వకార్ పేర్కొన్నాడు. పీఎస్ఎల్పై ఇప్పుడే భారీ అంచనాలు పెట్టుకోవద్దు, సుమారుగా మరో నాలుగు, ఐదేండ్ల తర్వాత ఈ లీగ్ ఐపీఎల్ మాదిరి ఫలితాలు సాధిస్తుందని పేర్కొన్నాడు. విజయవంతమైన ఐపీఎల్ కోహ్లి, రోహిత్ వంటి ఆటగాళ్లను మరింత రాటుదేలేలా చేసిందని వకార్ అభిప్రాయపడ్డాడు.