Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : మాజీ నెంబర్ వన్, జర్మనీ టెన్నిస్ స్టార్ స్టెఫీగ్రాఫ్ కేరళకు చెందిన ఆయుర్వేద చికిత్సకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైంది. బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాంది కేబినేట్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కేరళ పర్యాటక శాఖ కూడా దీనిని ఒప్పుకుంది. ఇంతకుముందే పర్యాటక శాఖ 46 ఏళ్ల స్టెఫీగ్రాఫ్‌తో చర్చలు జరిపారు. స్టెఫీగ్రాఫ్ తన కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి 2001లో టెన్నిస్ స్టార్ అండ్రీ అగస్సీని పెళ్లి చేసుకుంది.