Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత క్రికెటర్లకు బీసీసీఐ హ్యాండ్‌బుక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పది చాప్టర్లతో కూడిన ఈ బుక్‌ను పాలకుల కమిటీ చైర్మెన్ వినోద్ రారు విడుదల చేశారు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల్లో భాగంగా బీసీసీఐ కాంట్రాక్టు క్రికెటర్ల కోసం ఈ హ్యాండ్‌బుక్‌ను తీసుకొచ్చారు. మాజీ కెప్టెన్, భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ హ్యాండ్‌బుక్‌కు ముందుమాట రాశారు. దీనిలో మనీ మేనేజ్మెంట్ నుంచి భావోద్వేగాలతో కూడిన అంశాలను ప్రస్తావించారు. ఆటగాళ్లు గాయాల పాలైనప్పుడు భావోద్వేగాలకు గురవటం, కెరీర్‌ను సక్రమంగా మలచుకోవటం వంటి విషయాలను దీనిలో వివరించారు. వర్థమాన క్రికెటర్లకు ఈ హ్యాండ్‌బుక్ అత్యంత ఉపయుక్తమని ద్రవిడ్ పేర్కొన్నాడు. బీసీసీఐ, రాష్ట్ర సంఘాలతో మమేకమైన ఉన్న క్రికెటర్లందరూ తప్పక ఈ హ్యాండ్‌బుక్‌ను కల్గి ఉండాల్సి ఉంటుంది. '100 థింగ్స్ ఎవిరీ ప్రొఫెషనల్ క్రికెటర్ మస్ట్ నో' ( ప్రొఫెషనల్ క్రికెటర్ల తప్పక తెల్సుకోవాల్సిన 100 విషయాలు) పేరుతో బీసీసీఐ శుక్రవారం హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది.