Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ నడాల్ సెమీఫైనల్స్ పోరుపై ఆసక్తి నెలకొన్నది. స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు షాకిచ్చిన అర్జెంటీనా ఆటగాడు డెల్ పోట్రోతో నడాల్ సెమీ సమరంలో తలపడనున్నాడు. ఎనిమిదేండ్ల క్రీతం ఫెడరర్, నడాల్‌ను వరుసగా ఓడించి యు.ఎస్ ఓపెన్ దక్కించుకున్న పొట్రో ఇప్పుడూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తున్నాడు. మరి, టాప్ ఫామ్‌లో ఉన్న నడాల్ ఏం చేస్తాడో చూడాలి. మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా సంచలనం కెవిన్ అండర్సన్‌తో స్పెయిన్ ఆటగాడు బుస్టా ఫైనల్స్ బెర్త్ కోసం పోరాడనున్నాడు. నడాల్, డెల్ పోట్రో పోరు శుక్రవారం అర్ధరాత్రి 3 గంటలకు ఆరంభం కానుండగా, మరో సెమీస్ 1.30 గంటలకు మొదలవ్వనున్నది.