Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రియాంక పన్వార్‌పై నాడా (నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) ఎనిమిదేండ్ల నిషేధం విధించింది. ఇంచియాన్ గేమ్స్‌లో 4, 4000 మీటర్ల రిలే పరుగులో టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో పాటు ప్రియాంక స్వర్ణం సాధించింది. కానీ డోప్ పరీక్షల్లో ప్రియాంక దోరికిపోయింది. బి శాంపిల్స్‌లోనూ పాజిటివ్‌గా తేలటంతో ఆమెను 8 ఏండ్ల పాటు వేటు వేసింది. ప్రియాంకతో పాటు ఈ ఏడాది 40 మంది డోప్ పరీక్షల్లో దొరికిపోయారని నాడా పేర్కొన్నది.