Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్లూటీఏ, ఏటీపీ తాజా ర్యాంకింగ్స్
న్యూయార్క్ : స్పెయిన్ దిగ్గజాలు నడాల్, ముగురుజలు యుఎస్ ఓపెన్ తర్వాత వెలువడ్డ తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఈ సీజన్లో రెండు గ్రాండ్‌స్లామ్స్ ఖాతాలో వేసుకొని స్పెయిన్ బుల్ నడాల్ ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. డబ్లూటీఏ ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాది వింబుల్డన్ విజేత ముగురుజ తొలిసారి నంబర్ వన్‌గా అవతరించింది. క్విటోవా చేతిలో ఓడి యుఎస్ ఓపెన్ క్యార్టర్స్‌లో వెనుదిరిగిన స్పెయిన్ క్రీడాకారిణి.. రెండు స్థానాలు మెరుగు పరచుకుని మొదటి ర్యాంకు చేరింది. 2003లో అమెరికా ఆటగాళ్లు ఆండ్రే అగస్సీ, సెరెనా విలియమ్స్ ఓసారి ఒకటో ర్యాంక్‌లో నిలిచారు. తాజాగా ఒకే దేశం నుండి మహిళల, పురుషుల సింగిల్స్‌లో టాప్ ర్యాంకర్లుగా నడాల్, ముగురుజలు నిలిచారు.
పురుషుల్లో ఫెడరర్ ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంకు చేరుకోగా.. ముర్రే, జ్వెరెవ్‌లు వరుసగా మూడు, నాల్గు స్థానాల్లో ఉన్నారు. యుఎస్ ఓపెన్ సెమీస్‌లో ఓడిన బుస్టా టాప్ టెన్‌లో చోటు సాధించాడు. మహిళల్లో ఎలీనా స్విటోలినా ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంకు సొంతం చేసుకున్నది. రెండో ర్యాంకర్ సిమోనా హాలెప్ అదే స్థానంలో కొనసాగుతున్నది. గత నంబర్ వన్ కరోలినా ప్లిస్కోవా నాలుగవ ర్యాంకుకి పడిపోయింది. యుఎస్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వీనస్ విలియమ్స్ నాల్గు స్థానాలు ఎగబాకి ఐదవ స్థానంలో నిలిచింది.