Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ పోరులో నడాల్‌పై ఫెడరర్ విజయం
షాంఘై : ఈ ఏడాది టెన్నిస్ దిగ్గజాలిద్దరూ మూడు సార్లు టైటిల్ బరిలో నిలువగా ఫెడరర్దే పైచేయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, మియామి మాస్టర్స్‌లో స్పెయిన్ బుల్‌ను వెనక్కు నెట్టి టైటిల్ దక్కించుకున్న స్విస్ స్టార్.. చైనాలోనూ అదే పునరావృతం చేశాడు. నడాల్‌ను ఢకొీట్టడానికేనా అన్నట్టు ఫైనల్ చేరిన ఫెడరర్ వరుస సెట్లలో నడాల్‌ను కంగు తినిపించాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన తుది సమరంలో 6-4, 6-3తో ఫెడరర్ విజయం సాధించాడు. ఏడాదిలో ఫెడరర్‌కిది ఆరో టైటిల్ కాగా కెరీర్లో 94వది. ఇప్పటి దాకా ఒక్కసారి కూడా షాంఘై మాస్టర్స్ నెగని నడాల్ మరోసారి తృటిలో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి సెట్లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ప్రపంచ రెండో ర్యాంకర్ రోజర్ ఫెడరర్ 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. 3-4, 4-5తో నడాల్ పోటీలోకొచ్చినా.. వరుస సర్వీస్ విన్నర్లతో చెలరేగి 6-4తో సెట్ వశం చేసుకున్నాడు. రెండో సెట్లో పుంజుకున్న నెంబర్ వన్ నడాల్ దూకుడుగా ఆడినా ఫెడరర్ మెరుపులతో రెండు సార్లు సర్వ్ కోల్పోయాడు. 2-1తో ఆధిక్యం కనబరచినా, అది ఎక్కువసేపు నిలువలేదు. వరుసగా మూడు గేములు నెగ్గి ఫెడరర్ 4-2తో నిలిచాడు. ఈ సమయంలో మరో గేమ్‌తో పోటీలోకొచ్చిన నడాల్ ఆపై వరుసగా విఫలమయ్యాడు.
నాల్గు బ్రేక్ పాయింట్లు కొల్లగొట్టి ఫెడరర్ 6-3తో రెండు సెట్‌ను షాంఘై మాస్టర్స్ టైటిల్‌నూ దక్కించుకున్నాడు. 73 నిమిషాల పాటు జరిగిన హై ఓల్టేజీ పోరులో ఇరువురు ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నడాల్ నాల్గు ఏస్‌లు కొట్టగా, ఫెడరర్ పది ఏస్‌లు సంధించాడు. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ప్రీ క్వార్టర్స్‌లో సైతం నడాల్‌పై ఫెడరర్ గెలుపొందాడు. మొత్తంగా ఈ ఏడాదిలో నాల్గు సార్లు దిగ్గజ ఆటగాళ్ల ముఖాముఖి జరుగగా నాల్గు సార్లూ నడాల్ ఫెడరర్ చేతిలో ఓడాడు. కాగా ఫెడరర్ చేతిలో నడాల్‌కిది వరుసగా ఐదో పరాజయం. అయితే ఓవరాల్ ముఖాముఖిల్లో మాత్రం 23-14తో నడాల్ ముందున్నాడు. ఇటీవలి బీజింగ్ ఓపెన్ నడాల్కి ఆరో టైటిల్. వరుసగా గాయాలతో సతమతమవుతున్న నడాల్ పలు టోర్నీ ఫైనల్స్‌లో తడబడ్డాడు.
ఈ ఏడాది నాకు భావోద్వేగభరితమైనది. అద్భుతమైన మ్యాచ్‌లో ఫెడరర్ బాగా ఆడాడు. అతనికి నా అభినందనలు' - రఫెల్ నడాల్