Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలంబియాపై 4-0తో గెలుపు
- అమెరికా చేతిలో పరాగ్వే చిత్తు
ఆస్ట్రేలియా, భారత్ టీ20 రద్దు అయినందున టికెట్ల డబ్బులు వెనక్కి ఇస్తున్నట్టు హెచ్‌సీఏ ప్రకటించింది. కోనుగోలు దారులు టికెట్లు సహా బ్యాంక్ ఖాతా వివరాలు అందిస్తే, నేరుగా ఖాతాలోనే జమ చేస్తామని తెలిపారు. రూ. 800 టికెట్లకు 23, 24న, రూ. 1000 టికెట్లకు 25, 26న, రూ.1500 టికెట్లకు 27, 28న, రూ.5000 టికెట్లకు 30, 31 తేదిలలో ఉప్పల్ స్టేడియం వద్ద వివరాలు అందించాలని కోరారు. కార్పోరేట్ బాక్స్‌లకు సంబంధించి తేదిలను తర్వాత ప్రకటించనున్నారు.
న్యూఢిల్లీ : ఫిఫా అండర్17 ప్రపంచకప్‌లో జర్మనీ దుమ్మురేపుతోంది. నాకౌట్లో తొలి విజయంతో జర్మనీ క్వార్టర్ఫైనల్లోకి చేరుకున్నది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన తొలి ప్రీ క్వార్టర్స్ పోరులో కొలంబియాపై జర్మనీ ఏకపక్ష విజయం సాధించింది. 4-0తో కొలంబియాను చిత్తుగా కొట్టేసింది. మరో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో అమెరికా గోల్స్ వర్షం కురిపించింది. పరాగ్వేను 5-0తో చిత్తుగా ఓడించి, క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. జర్మనీ ఏడో నిమిషంలోనే ఖాతా తెరిచింది. కెప్టెన్ జాన్ ఫిటె ఏఆర్పీ ఆరంభంలోనే గోల్ కొట్టాడు. 39వ నిమిషంలో బిస్సెక్ మరో గోల్‌తో జర్మనీని 2-0తో ముందంజలో నిలిపాడు. 49వ నిమిషంలో యబోV్‌ా మరో గోల్ చేయగా జర్మనీ విజయం లాంఛనమైంది. ద్వితీయార్థంలో ఏఆర్పీ మరో గోల్ జర్మనీ ఆధిక్యాన్ని 4-0కు పెంచాడు. కొలంబియా గోల్ ప్రయత్నాలేమీ ఫలించలేదు. మరో క్వార్టర్స్‌లో అమెరికా ఫార్డర్డ్ టిమ్ వీV్‌ా హాట్రిక్ గోల్స్‌తో ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. వీV్‌ా వరుసగా 19, 53, 77 నిమిషాలలో గోల్స్ కొట్టి ఔరా అనిపించాడు. కార్లెటన్, సర్జెంట్లు చెరో గోల్‌తో అమెరికా ఆధిక్యాన్ని 5-0 తీసుకెళ్లారు. పరాగ్వే కనీసం ఒక్క గోలైనా చేయలేకపోయింది. నేడు జరిగే ప్రీ క్వార్టర్స్‌లో ఇరాన్, మెక్సికోలు సహా ఫ్రాన్స్, స్పెయిన్లు తలపడను న్నాయి. ఇంగ్లాండ్‌తో జపాన్, మాలితో ఇరాక్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.