Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ రేసులో సింధు, శ్రీకాంత్
- బరిలో సైనా, సాయిప్రణీత్, ప్రణరు
- నేటి నుంచే డెన్మార్క్ సూపర్ సిరీస్
ఒడెన్సె (డెన్మార్క్): కొంత విరామం, మరింత సాధన తర్వాత తెలుగు తేజం, సిల్వర్ స్టార్ పి.వి సింధు మరో సూపర్ సిరీస్ టైటిల్ వేటలో పడింది!. జపాన్ ఓపెన్‌లో ఆరంభ రౌండ్లలోనే నిష్క్రమించిన సింధు, తర్వాత గోపీచంద్ అకాడమీలో రెండు వారాల పాటు శిక్షణలో గడిపింది. నేడు ఆరంభమయ్యే డెన్మార్క్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరేట్‌గా సింధు బరిలోకి దిగుతుండగా, పురుషుల సింగిల్స్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తున్నాడు. 16 నెలలుగా సూపర్ సిరీస్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సైనా నెహ్వాల్ సైతం డెన్మార్క్‌లో ఆశావహ దృక్పథంతో ఆడాలని చూస్తోంది. మహిళల సింగిల్స్‌లో సింధుకు క్వార్టర్స్ వరకూ సులభమైనా డ్రానే ఎదురైనా, సెమీస్ దారిలో చైనా సూపర్‌స్టార్ హీ బింగ్జియావో ఎదురుకానున్నది. ఇటీవల కొరియా ఓపెన్‌లో బింగ్జియావోను సింధు చిత్తుగా ఓడించినా, చైనా చిన్నది ఎప్పటికీ ప్రమాదకర క్రీడాకారిణీయే. సైనా నెహ్వాల్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. తొలి రౌండ్లోనే ఒలింపిక్ చాంపియన్ కరొలినా మారిన్‌తో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని ఆశావహ దృక్పథంతో ఉన్న సైనాకు మారిన్‌తో పోరు సవాల్. సెమీఫైనల్లో పి.వి సింధుతో మారిన్ ఢకొీట్టే అవకాశం ఉన్నది. పురుషుల సింగిల్స్‌లో కిదా ంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో క్వాలిఫయ ర్తో ఆడను న్నాడు. క్వార్టర్స్‌లో లోకల్ స్టార్, వరల్డ్ నెం.1 విక్టర్ అక్సెల్సన్ను దాటేస్తే, శ్రీకాంత్ టైటిల్ వేట సగం పూర్తయినట్టే!. అజరు జయరాం తొలి రౌండ్లో చైనా స్టార్ లిన్ డాన్‌తో తలపడనుండగా, సాయి ప్రణీత్ డెన్మార్క్ షట్లర్‌తో పోరు ఆరంభించనున్నాడు. హెచ్.ఎస్ ప్రణరుకి సైతం మంచి అవకాశాలే ఉన్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డిలు సహా మెన్స్ డబుల్స్ విభాగంలో మను అట్రి రెడ్డి, సుమీత్ రెడ్డిలపై భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
కశ్యప్ మెరిసేనా?
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన స్టార్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ కెరీర్ తారాజువ్వలా సాగుతున్న దశలో, మెన్స్ సింగిల్స్ విభాగంలో కశ్యప్ మరో సైనా కాగలడనే అంచనాలు. కానీ ఏమైందో ఏమో గానీ రానురాను కశ్యప్ ఆట మరీ తీసికట్టుగా తయారవుతోంది. వరుస ఓటములతో ప్రధాన టోర్నీలకు నేరుగా అర్హత సాధించలేని స్థితికి దిగజారాడు. డెన్మార్క్ సూపర్ సిరీస్‌లోనూ కశ్యప్ కథ భిన్నంగా ఏమీ లేదు. నేడు జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కశ్యప్ బరిలోకి దిగనున్నాడు. తొలి మ్యాచ్‌లో విక్టర్ స్వెడన్సెన్ (డెన్మార్క్)తో ఆడనున్నాడు. ప్రధాన టోర్నీకి చేరుకోవాలంటే కశ్యప్ రెండు విజయాలు సాధించాల్సి ఉన్నది. భారత్ నుంచి సుధాకర్ సైతం అర్హత మ్యాచుల్లో ఆడుతున్నాడు.