Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరి చూపు సుశీల్పైనే
ఇందోర్ : జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు సర్వం సిద్ధమైంది. మూడేండ్ల తర్వాత రెజ్లింగ్ నేషనల్స్ బరిలోకి దిగుతున్న సుశీల్ కుమార్‌పైనే అందరి దృష్టి. పురుషుల 74 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో రెండు ఒలింపిక్ మెడల్స్ విజేత సుశీల్ ఫేవరెట్ రెజ్లర్. రానున్న కామన్వెల్త్, ఆసియన్ గేమ్స్‌ను దృష్టిలో ఉంచుకుని నేషనల్స్‌లో ఉత్తమ ప్రదర్శన చేయటానికి సుశీల్ ఉవ్శిళ్లూరుతున్నాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్ కాంస్య విజేత సాక్షి మాలిక్, గీతా ఫోగట్‌లు హాట్ ఫేవరెట్లు. ఆగష్టులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన సాక్షి, వినేశ్ ఫోగట్‌లు ఇందోర్‌లో రాణించాలని చూస్తున్నారు. గాయంతో బబిత కుమారి పోటీలో లేదు.