Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : ఈడెన్ గార్డెన్స్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యాడు. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న విరాట్.. టెస్టుల్లో ఐదో స్థానానికి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పరుగులేమి చేయని కోహ్లి, రెండో ఇన్నింగ్స్‌లో 104 కొట్టాడు. ఆసీస్ స్టార్ డెవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టి కోహ్లి ఐదో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్ (ఆసీస్), జోరు రూట్ (ఇంగ్లాండ్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. చటేశ్వర్ పుజారా నాల్గో స్థానంలో, కెఎల్ రాహుల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా 20 రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. అశ్విన్ యథావిధిగా నాల్గో స్థానాన్ని నిలుపుకున్నాడు.