Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ధర్మశాల ఓటమితో ఈ మ్యాచ్లో విజయం నాకూ, జట్టుకూ ఎంతో కీలకం. ఆరంభంలో ఎంతో నెమ్మదిగా ఆడా. కానీ ధావన్, శ్రేయాష్ దూకుడు కనబరిచారు. సెంచరీ తర్వాత నిలిస్తే, అవుట్ కానని నాకు తెలుసు. గత రెండు డబుల్ సెంచరీలు సైతం ఇలాగే సాధించాను. రెండో వివాహ వార్షికోత్సవం నాడు నా భార్య ఇక్కడ ఉండటం ఎంతో హ్యాపీ. నా బహుమతితో ఆమె సంతోషంగా ఉందని అనుకుంటున్నా. ఒత్తిడితో కూడుకున్న క్రికెట్లో భాగస్వామి తోడు అవసరం. రీతిక నా బలం, నా ఆత్మవిశ్వాసం. వైజాగ్ వన్డే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' - రోహిత్ శర్మ