Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి వివేక్ అనర్హుడు
- టీపీఎల్ టోర్నీ చట్టవిరుద్ధం: అజారుద్దీన్
నవతెలంగాణ- సిటీబ్యూరో
''సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం ఓ రాజకీయ నాయకుడు హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. వివేక్ తన పలుకుబడితో లోథా కమిటీని ప్రభావితం చేశాడు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి వివేక్ అనర్హుడు. తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)కు బీసీసీఐ అనుమతి లేదు. ఇది కచ్చితంగా చట్టవిరుద్ధం. హెచ్‌సీఏ అవినీతిమయంగా మారింది. ఈ విషయాలపై బీసీసీఐకు, పాలకుల కమిటీకి లేఖ రాశా'' అని టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లా డుతూ...టీపీఎల్‌ను ఒకప్పుడు వ్యతిరేకించి, ఇప్పుడెందుకు సమర్ధిస్తున్నారని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించడం చట్ట వ్యతిరేకమన్నారు. ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ కలిగిన వివేక్, తన తండ్రి పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తూ, హెచ్‌సీఏ లోగోను ప్రచారానికి ఎలా వినియో గించుకుంటారని నిలదీశారు. ఐపీఎల్, తమిళనాడు, కర్నాటక ప్రీమి యర్ లీగ్్లకు బీసీసీఐ అనుమతి ఉందని, టీపీఎల్‌కు బీసీసీఐ అనుమతి లేదని గుర్తు చేశారు. లీగ్‌లో ఆడిన క్రీడాకారులకు ఏ ప్రయోజనమూ ఉండకపోగా, పనికిరాని సర్టిఫికెట్లతో క్రికెటర్ల భవిష్యత్ అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.