Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్రం, ఆమ్లా అర్థ శతకాలు
- తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 269/6
- ఆఖర్లో అదరగొట్టిన హార్దిక్ ఫీల్డింగ్
- సఫారీతో రెండోటెస్టు తొలిరోజు
నవతెలంగాణ-సెంచూరియన్
బౌన్సీ సెంచూరియన్ పిచ్‌పై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మెరిశాడు. ఓపెనర్లను అవుట్ చేశాడు. అయితే సొంతగడ్డపై ఆడుతోన్న దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై పట్టు కోల్పోలేదు. సెంచరీ ముంగిట క్రీజును వీడిన మార్క్రం, హషీమ్ ఆమ్లాలు రాణించడంతో సఫారీలు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేశారు. అశ్విన్ అద్వితీయ బౌలింగ్‌కు హార్దిక్ పాండ్య మెరుపు ఫీల్డింగ్ తోడవటంతో ఆఖరు నిమిషాల్లో డుప్లెసిస్ సేన మూడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 269/6తో ఉన్నది.
సెంచూరియన్ టెస్టులో తొలిరోజు భారత్ ఆధిపత్యం చలాయించకపోయినా..ప్రత్యర్థి కీలక వికెట్లను పడగొట్ట టంలో సఫలమైంది. ఆఖరు సెషన్లో రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు కూల్చిన కోహ్లి సేన కీలక బ్యాట్స్ మెన్‌ను పెవిలియన్ పంపించింది. అనుకున్నట్టుగానే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకు న్నాయి. ఓపెనర్‌గా శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. బౌలర్లలో భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకున్నాడు కోహ్లి. ఇషాంత్ ఒక వికెట్ తీయగా ఆశ్చర్యకరంగా సెంచూరియన్ బౌన్సీ పిచ్‌పై స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ (3/90) మెరిశాడు. ఓవరాల్‌గా భారత బౌలింగ్ బృందం కట్టు దిట్టమైన బౌలింగ్ చేయనప్పటికీ ఫరవాలేదనిపించారు. దక్షిణాఫ్రికా నిలకడైన ఆటతీరు కనబర్చింది. ఓపెనర్ ఏడెన్ మార్క్రం (94), ఆమ్లా (82) రాణించారు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో కొనసాగుతోంది దక్షిణాఫ్రికా.
అశ్విన్ మాయ : టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి వికెట్ కోసం నిరీక్షించిన భారత్‌కు ఎల్గార్ (31) రూపంలో తొలి వికెట్ అందించాడు అశ్విన్. భుజానికి తాకి దోబూచులాడిన బంతిని విజరు ఎట్టకేలకు ఒడిసి పట్టటంతో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్లిన మరో ఓపెనర్ మార్క్రం (94) సైతం అశ్విన్ బౌలింగ్ కీపర్ పార్థివ్ పటేల్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. ఇషాంత్ శర్మ చేతిలో ఫామ్‌లో ఉన్న డివిలియర్స్ బౌల్టయ్యాడు. 65 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. పాండ్య అద్బుతమైన ఫీల్డింగ్ తళుకులతో ఆమ్లా (82)ను రనౌట్ చేశాడు. రెండు బంతుల వ్యవధిలోనే డికాక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో కోహ్లికి చిక్కాడు. ఫిలాండర్ (0) పాండ్య, పార్థివ్ల సమన్వయంతో రనౌట్ అయ్యాడు. డుప్లెసిస్ (24 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (10 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : డీన్ ఎల్గార్ (సి) మురళీ విజరు (బి) రవిచంద్రన్ అశ్విన్ 31, ఏడెన్ మార్క్్రం (సి) పార్థివ్ పటేల్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 94, హషీమ్ ఆమ్లా రనౌట్ (హార్దిక్ పాండ్య ) 82, ఏబీ డివిలియర్స్ (బి) ఇషాంత్ శర్మ 20, డుప్లెసిస్ బ్యాటింగ్ 24, క్వింటన్ డికాక్ (సి) విరాట్ కోహ్లి (బి) అశ్విన్ 0, వెర్నన్ ఫిలాండర్ రనౌట్ (పార్థివ్ పటేల్/హార్దిక్ పాండ్య) 0, కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ 10, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం : (90 ఓవర్లలో 6 వికెట్లకు) 269.
వికెట్ల పతనం : 1-85, 2-148, 3-199,
4-246, 5-250, 6-251.
బౌలింగ్ : బుమ్రా 18-4-57-0, మహమ్మద్ షమి 11-2-46-0, ఇషాంత్ శర్మ 16-3-32-1, హార్దిక్ పాండ్య 14-4-37-0, అశ్విన్ 31-8-90-3.