Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి పోరులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం
- పృథ్వీషా, మన్జోత్, శుభ్‌మన్ అర్థ శతకాలు
- శివం, కమలేష్ పేస్ మెరుపులు
మౌంట్ మాంగనుయి : అండర్ 19 ప్రపంచ కప్‌లో యువభారత్ శుభారంభం చేసింది. సమిష్టి ప్రతిభతో గ్రూప్ బి తొలిపోరులోనే ఆస్ట్రేలియాపై వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, భారత కెప్టెన్ పృథ్వీషా (94, 100 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టాడు. ఓపెనర్ మన్జోత్ కల్రా (86, 99 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌్) సహా శుభ్‌మన్ గిల్ (63, 54 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌్)లు రాణించటంతో భారత్ 328 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యువ పేసర్లు కమలేష్ నాగర్కోటి (3/29), శివం మావి (3/45))లు ప్రత్యర్థులను కట్టడి చేయటంతో ఛేదనలో కుర్ర కంగారూలు 228 పరుగులకే కుప్పకూలారు. పటిష్ట ఆస్ట్రేలియాను ఆటాడుకున్న భారత్ తొలి పోరులో సత్తా చాటి మిగిలిన జట్లకు సవాల్ విసిరింది. తదుపరి మ్యాచ్‌లో భారత్, పపువా న్యూగినియాతో మంగళవారం తలపడనున్నది.
ఓపెనర్ల జోరు : టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ పృథ్వీషా, మన్జోత్లు చెలరేగి ఆడారు. చెరో అర్థ శతకం అందుకున్నాక ఈ జంట జోరుకు అడ్డులేకుండా పోయింది. చేష్టలుడిగి చూడటం ఆసీస్ బౌలర్ల వంతయింది. కంగారూ బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ జోడీ తొలి వికెట్‌కు 180 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దూకుడుగా ఆడిన పృథ్వీషా శతకానికి ఆరు పరుగుల దూరంలో వెనుదిరిగాడు. సూదర్లాండ్ బంతికి వికెట్ కీపర్ హోల్ట్ చేతిలో క్యాచౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ సైతం దూకుడుగా ఆడాడు. పరం ఉప్పల్ బౌలింగ్‌లో జేసన్ సంగాకు క్యాచ్ ఇచ్చిన మన్జోత్ క్రీజును వీడగా.. హిమాన్షు రానా (14) సహకారంతో కలిసి శుభ్‌మన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖరు ఐదు ఓవర్లలో భారత్ నాల్గు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (23) ఆఖరి మెరుపులతో భారత్ 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కమలేష్ నాగర్కోటి (11 నాటౌట్), ఆర్యన్ జుయాల్ (8 నాటౌట్) అజేయంగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ ఒక్కడే నాల్గు వికెట్లు కూల్చాడు.
ఆసీస్ విలవిల: భారత పేసర్ల ధాటికి ఆసీస్ విలవిలలాడింది. ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ (73) ఓపెనింగ్‌లో మనోళ్ల సహనాన్ని పరీక్షించినా.. అనుకూల్ బంతికి బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ మాక్స్ బ్రేంట్ (29), జోనాథన్ మెర్లొ (38), వికెట్ కీపర్ బాక్స్టర్ హోల్ట్ (39) మినహా ఎవరూ రాణించలేదు. మనోళ్ల పేస్ ధాటికి రక్షణాత్మక ఆటతీరు కనబరిచిన ఆస్ట్రేలియా.. 43 ఓవర్ల దాకా వికెట్లు కాపాడుకోగలిగినా.. లక్ష్యాన్ని ఛేదించటంతో మాత్రం చతికిల బడింది. 228 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక బ్యాట్స్‌మెన్‌ను కమలేష్ నాగర్కోటి పెవీలియన్ చేర్చగా, శివం మావి టెయిలెండర్ల పనిపట్టాడు. వీరిద్దరూ చెరో మూడు వికెట్ల పడగొట్టారు. అనుకూల్ రారు, అభిషేక్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.
భారత ఇన్నింగ్స్ : పృథ్వీషా (సి) హోల్ట్ (బి) సూదర్లాండ్స్ 94, మన్జోత్ కల్రా (సి) జేసన్ (బి) ఉప్పల్ 86, శుభ్‌మన్ గిల్ (సి,బి) ఎడ్వర్డ్స్ 63, హిమాన్షు రానా (సి) ఆస్టిన్ (బి) ఎడ్వర్డ్స్ 14, అనుకూల్ రారు (సి) జేసన్ (బి) ఆస్టిన్ 6, అభిషేక్ శర్మ (సి) సూదర్లాండ్స్ (బి)ఎడ్వర్డ్స్ 23, కమలేష్ నాగర్కోటి నాటౌట్ 11, శివ సింగ్ (బి) ఎడ్వర్డ్స్ 10, ఆర్యన్ జుయాల్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం : (50 ఓవర్లలో 7 వికెట్లకు) 328.
బౌలింగ్ : బార్లెట్ 7-1-47-0, జేసన్ 5-0-26-0, సూదర్లాండ్స్ 10-0-55-1, ఎడ్వర్డ్స్ 9-0-65-4, లాయిడ్ పోప్ 3-0-22-0, జోనాథన్ 2-0-13-0, ఉప్పల్ 8-0-35-1, ఆస్టిన్ 6-0-64-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : జాక్ ఎడ్వర్డ్స్ (బి) అనుకూల్ రారు 73, మాక్స్ బ్రేంట్ (సి) శివం మావి (బి) నాగర్కోటి 29, జేసన్ సంఘా (సి) పృథ్వీషా (బి) అభిషేక్ 14, జోనాథన్ మెర్లో (బి) శివం మావి 38, పరం ఉప్పల్ రనౌట్ (శివం/ఆర్యన్) 4, ఆస్టిన్ వాగ్ (సి) ఆర్యన్ జుయాల్ (బి) నాగర్కోటి 6, విల్ సూదర్లాండ్స్ (బి) నాగర్కోటి 10, బాక్స్టర్ హోల్ట్ (ఎల్బీ) (బి) శివం మావి 39, గ్జేవియర్ బార్ట్లెట్ (సి) ఆర్యన్ (బి) శివం మావి 7, జేసన్ రాల్స్టన్ రనౌట్ (రానా/శివం మావి) 3, లాయిడ్ పోప్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం : (42.5 ఓవర్లలో 10 వికెట్లకు) 228.
బౌలింగ్ : శివం మావి 8.5-1-45-3, ఇషాన్ పోరెల్ 4.1-0-24-0, శివ సింగ్ 6.5-0-30-0, కమలేష్ నాగర్కోటి 7-1-29-3, అభిషేక్ శర్మ 7-0-33-1, హిమాన్షు రానా 4-0-30-0, అనుకూల్ రారు 5-0-36-1.